స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తత…
1 min read
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తత...
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం లో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వీలు లేకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అభ్యర్థి మణెమ్మ భుజం పై, చేతి పై కత్తితో దాడి చేసారు. ఆమె అల్లుడిని తీవ్రంగా గాయపరిచారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్న, కిషోర్ పై దాడికి పాల్పడ్డారు. తిరుపతి మండలి పరిధిలోని పాడిపేటలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించివేశారు.
గుంటూరు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడకలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. వైసీపీ నేతలు హద్దుమీరి
ప్రవర్తిస్తున్నా పోలీసులు అవేమి పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.