బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్…
1 min read
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని నియమించారు. ఈ ఎంపికను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఖరారు చేసినట్టుగా పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె.లక్ష్మణ్ నే మరోసారి కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్ వైపు మొగ్గు చూపింది.
Please follow, like and share us: