వైసీపీక పై నిప్పులు చెరిగిన: శైలజానాథ్
1 min read
వైసీపీక పై నిప్పులు చెరిగిన: శైలజానాథ్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ… నామినేషన్ల ముందు రోజు రిజర్వేషన్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, వైసీపీ దుశ్చర్యలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటారన్న నమ్మకం కలగడంలేదన్నారు. తమ ఫిర్యాదులు బుట్టదాఖలవుతాయన్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.