Wed. Jan 27th, 2021

షాకిచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!

1 min read
షాకిచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!

షాకిచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!

జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేయడంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే తాను మునుపు బాధ్యతలు నిర్వహించిన పదవి కంటే తక్కువ పదవికి నామినేషన్ వేసి షాకిచ్చారు. తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్ గా ఆయన తరుపున ఆయన న్యాయవాదులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అదే వార్డు నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడంతో అక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయకపోవడమే మంచిది అని జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఈ ప్రస్తావన తీసుకొస్తే
ఆయన ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని చెప్పారు. ఈ నేపథ్యంలో, తను మాట్లాడుతూ తన సొంత మనుషులు కూడా తన మాట వినడం లేదని ఆయన నిట్టూర్చారు. ఈ పరిస్థితుల్లో ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.

Please follow, like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *