Tue. Apr 20th, 2021

చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు… రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు

1 min read
చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు... రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు

చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు... రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు

గుంటూరు జిల్లా మాచర్లలో బుద్ధా వెంకన్న, బోండా ఉమ పై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పిర్యాదు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… గాయాలు పాలైన అందరూ వాహనాలతో సహా బయలుదేరి డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకోగానే పోలీసులు ఎవరిని లోపలి రానివ్వకుండా గేట్లు మూసేసారు. దాంతో చంద్రబాబు డీజీపీ ఆఫీసు ఎదుటే రోడ్డు పై బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ నేతలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం కూడా నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ డీజీపీ ఆఫీసులో లేరని, అడిషనల్ డీజీ వస్తే ఆయనకు విజ్ఞాపన పత్రం సమర్పించామని చెప్పారు. ఈ సందర్భంగా ‘సీపీఐ’ రామకృష్ణ టీడీపీ నేతలకు సంఘీభావం ప్రకటించారు.

Please follow, like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *