టీడీపీ అభ్యర్థి నివాసం లో దుండగులు…. సీసీ టీవీలో నిక్షిప్తం..
1 min read
టీడీపీ అభ్యర్థి నివాసం లో దుండగులు.... సీసీ టీవీలో అంతా నిక్షిప్తం..
స్థానిక ఎన్నికల సందర్బంగా తెనాలి పురపాలక ఎన్నికల సమరం హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించేందుకు తెనాలి నాలుగో వార్డులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నివాసంలో ఓ వ్యక్తి దొంగచాటుగా మద్యంసీసాల కేసు దాచే సన్నివేశం సీసీ కెమెరాలకు చిక్కింది. టీడీపీ అభ్యర్థిని ఎక్సైజ్ కేసుల్లో ఇరికించాలన్నది ప్రత్యర్థుల ప్లాన్ అని ఈ చర్య ద్వారా వెల్లడైంది.
అర్థరాత్రి దాటిన తర్వాత ఆ అభ్యర్థి ఇంటివద్దకు ఇద్దరు ఆగంతుకులు బైక్ పై వచ్చి, గేటు మూసి ఉండడంతో వారిలో ఒకరు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. బయట ఉన్న వ్యక్తి మద్యంసీసాల కేసును అందించగా లోపల వ్యక్తి మెట్లమీదుగా టెర్రస్ పైకి చేరుకుని అక్కడున్న వాటర్ ట్యాంక్ కింద ఆ కేసును ఉంచాడు. మళ్లీ ఏమీ తెలియనట్టుగా కిందికి వచ్చి బైక్ పై వెళ్లిపోయాడు. ఇదంతా సీసీ కెమెరా బంధించింది. అయితే మరుసటి రోజు ఉదయమే ఏసీబీ అధికారులు టీడీపీ అభ్యర్థి ఇంటిపై దాడి చేశారు. నేరుగా టెర్రస్ పైకి వెళ్లి అక్కడున్న మద్యంసీసాల కేసును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో లేకపోవడంతో ఆయన బంధువును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.