అదరగొట్టిన మేడ్చల్ జిల్లా అమ్మాయిలు…
1 min read
అదరగొట్టిన మేడ్చల్ జిల్లా అమ్మాయిలు...
కష్టపడితే సాధించలేనిది ఏది లేదు అని, మేడ్చల్ జిల్లా ధూళిపల్లి సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజీ లో CSE నాలుగో సంవత్సరం చదువుతున్న మధురిమ, శిరీష నిరూపించారు. అమెజాన్ ఇండియా లో రూ.27లక్షల వార్షిక వేతనంతో బంపర్ ఆఫర్ కొట్టేసారు.
కాలేజీలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో ఆఫర్స్ సాధించారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ కుమార్ విద్యార్థినులకు ఆఫర్ లెటర్స్ అందజేశారు.ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం మధురిమ, శిరిషను అభినందించింది. కష్టపడి చదివినందుకు నిజమైన ప్రతిఫలం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు మధురిమ, శిరిష.