Tue. Apr 20th, 2021

సైకో ప్రవీణ్‌కు ఉరిశిక్ష…

1 min read
సైకో ప్రవీణ్‌కు ఉరిశిక్ష...

సైకో ప్రవీణ్‌కు ఉరిశిక్ష...

వరంగల్: హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత హత్యాచారం కేసులో సంచలనం రేపిన హంతకుడు ప్రవీణ్‌కు ఉరిశిక్షను ఖరారు చేశారు. చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ముద్దాయి ప్రవీణ్, జడ్జి జయకుమార్ ఎదుట నేరం అంగీకరించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు శిక్షను ఖరారు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. . ఇక ఈ కేసులో 30కి పైగా సాక్షులను విచారించిన కోర్టు.. 48రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. మరోవైపు అతడికి సహాయం చేసేందుకు న్యాయవాదులు కూడా నిరాకరించారు. ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించాలంటూ పలు సంఘాలు తమ డిమాండ్‌ను వ్యక్తపరిచాయి.

Please follow, like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *