Tue. Jun 18th, 2019

సీఎం జగన్‌కు నా పూర్తి సహాయ సహకారాలు : జనసేన ఎమ్మెల్యే

1 min read
సీఎం జగన్‌కు నా పూర్తి సహాయ సహకారాలు : జనసేన ఎమ్మెల్యే

సీఎం జగన్‌కు నా పూర్తి సహాయ సహకారాలు : జనసేన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలుపుతూ.. తొలిరోజు శాసనసభ సమావేశాలు సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన సీఎం జగన్‌తో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి శాసనసభకు వచ్చిన జగన్‌ను పలకరించి, అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *