Tue. Jun 18th, 2019

సీఎంగా జగన్‌ తొలి ప్రసంగం…

1 min read
AP CM Jagan Pramana Sweekaram

Ap CM jagan about polavaram

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జగన్‌ ప్రసంగించారు.

‘‘వైఎస్‌ జగన్‌ అను నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా.. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3,648 కి.మీ పాదయాత్ర చేశా. పేదలు కష్టాలు చూశా. అందుకీ పింఛను దస్త్రంపై తొలి సంతకం చేస్తున్నా. యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలు ..అలాగే అవినీతి లేని పాలన అందిస్తా అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *