Tue. Jun 18th, 2019

వామ్మో… నారా లోకేష్ ఛాంబరా? నాకు వద్దు బాబోయ్…ఏ పీ మంత్రి

1 min read
నారా లోకేష్ ఛాంబరా? నాకు వద్దు బాబోయ్...

నారా లోకేష్ ఛాంబరా? నాకు వద్దు బాబోయ్...

వైసీపికి చెందిన కొత్త మంత్రులు మంచి ముహూర్తం చూసుకుంటూ సచివాలయంలో ఆయా ఛాంబర్లను కేటాయించారు. దాంతో వారివారి ఛాంబర్లలోకి ప్రవేశిస్తున్నారు కొత్త మంత్రులు. ఐతే ప్రత్యేకించి ఓ మంత్రి మాత్రం తనకు కేటాయించిన ఛాంబర్ 188 గదిని చూసి జడుసుకున్నారట. తనకు ఆ ఛాంబర్ వద్దు బాబోయ్ అని చెప్పారట.

ఇంతకీ ఆ ఛాంబర్ ఎవరిదయా అంటే… గతంలో మాజీ మంత్రి నారా లోకేష్ బాబుది. ఈ ఛాంబర్‌ను ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అధికారులు కేటాయించారట. విషయం తెలుసుకున్న మంత్రిగారు తనకు ఆ ఛాంబర్ వద్దుబాబోయ్ అని చెప్పారట. దాంతో ఆయనకి సచివాలయంలోని 3వ బ్లాక్‌లోని 203 రూమ్‌ను ఛాంబర్‌గా కేటాయిస్తూ ఏర్పాట్లు చేశారట. అదీ సంగతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *