Tue. Jun 18th, 2019

రాజకీయాలకి వీడ్కోలు… జేసీ దివాకర్‌రెడ్డి

1 min read
Jc diwakar Reddy

Jc diwakar Reddy

అనంతపురం మాజీ ఎంపీ సీనియర్‌ నేత అయిన జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం కావడంతో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా లోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు 40 ఏళ్లుగా సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ వ్యవహరిస్తున్న తీరు శుభపరిణామమని జేసీ వ్యాఖ్యానించారు. ‘‘జగన్‌పై రాజకీయ విమర్శలు చేశానే తప్ప ఎప్పుడూ ద్వేషించలేదు. జగన్‌ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అలాగని నేను పార్టీ మారాలనుకోవడం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలపై ప్రస్తుతం తనకు ఆసక్తి లేదన్నారు. అయితే ఎన్నికల సంఘంలో మార్పులు చేయాల్సిన అవసరముందని జేసీ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *