Thu. Jul 18th, 2019

మద్యం మత్తులో.. దుర్గ గుడి పైనుంచి జారి లోయలో పడిన యువకుడు

1 min read
drunk man

drunk man

ఓ యువకుడు మద్యం మత్తులో ఇంద్రకీలాద్రి కొండ పైనుంచి కిందికి జారిపడడంతో తీవ్ర కలకలం సృష్టించింది. జగన్ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తుండడంతో, ఇంద్రకీలాద్రి ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అదే సమయంలో కొండపై ఉన్న వాటర్ ట్యాంక్ పక్కన ముగ్గురు యువకులు మద్యం సేవించి పేకాడుతున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులను చూసి ముగ్గురూ పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిలో శ్రీకాంత్ అనే యువకుడు పట్టుతప్పడంతో కొండ పైనుంచి కిందికి పడిపోయాడు. కింద ఉన్న ముళ్లకంపలో చిక్కుకుపోవడంతో గాయాలయ్యాయి. పోలీసులు అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *