Tue. Apr 20th, 2021

రాజకీయవేత్త గా మారిన సాధారణ వ్యక్తి…

1 min read
సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోహీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన...
suriya pressmeet about new movie release

suriya pressmeet about new movie release

సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోహీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఎన్‌.జి.కె’. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్‌కి అందించారు.

ఈ కార్యక్రమంలో హీరో సూర్య మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు థ్యాంక్స్. నా గత చిత్రం విడుదలై ఏడాదిన్నర సమయం పట్టింది. మీలాగానే నేను కూడా శ్రీరాఘవగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయనతో ఈ సినిమా చేశాను. సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఇది యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. నా జీవితంలో శ్రీరాఘవగారు స్పెషల్‌ పర్సన్‌. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్‌ చేశాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత వ్యవహారాలను పక్కన పెట్టి వర్క్‌ చేశారు. శ్రీరాఘవగారు, యువన్‌ మ్యాజికల్‌ కాంబోలో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. రకుల్‌, సాయిపల్లవికి థ్యాంక్స్‌. మే 31న ప్రేక్షకుల అంచనాలను అందుకుంటామని భావిస్తున్నాను. ఓ సాధారణ వ్యక్తి రాజకీయ శక్తిగా మారి సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడనేదే ఈ సినిమా’’ అన్నారు.

Please follow, like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *