Tue. Jun 18th, 2019

పోలవరం పై ప్రత్యేక ద్రుష్టి : జగన్

1 min read
Ap CM jagan about polavaram

Ap CM jagan about polavaram

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర జలవనరులపై చర్చ నిర్వహించారు. ఈ చర్చలో భాగంగా నీటిపారుదల, జలవనరుల విభాగాలకు సంబంధించిన పోలవరం ప్రాజక్టు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే, స్వయంగా తానే వచ్చేవారం పోలవరం వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని జగన్ సిద్ధమవుతున్నారు.

పోలవరం వెళ్లే ముందే మరొక సారి జలవనరుల శాఖ చర్చ నిర్వహించాలని భావిస్తున్నారు. పోలవరం ప్రాజక్టు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందని, వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వగలమని సీఎంతో చెప్పారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు వెచ్చించిందని, కేంద్రం నుంచి రూ.4,200 కోట్లు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *