Tue. Jun 18th, 2019

పార్ట్ ఫిరాయింపులపై కే టి ఆర్… ధ్వజం.

1 min read
పార్ట్ ఫిరాయింపులపై కే టి ఆర్... ధ్వజం.

పార్ట్ ఫిరాయింపులపై కే టి ఆర్... ధ్వజం.

తెలంగాణా లో పార్టీ ఫిరాయింపుల కలకలం… పార్టీలు ఫిరాయించే సంస్కృతిని మొదలు పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీ ఎన్నికలలో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ, 2004 ఎన్నికల్లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని ఆ పార్టీలో కలుపుకోలేదా? అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తమ పార్టీ ఎమ్మెల్సీలను, ఎంపీలను చేర్చుకోవడం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఆ పార్టీ నేతలకు గుర్తు రాలేదా? అన్నారు. వాళ్లతో పోలిస్తే మేం చాలా హుందాగా వ్యవహరించామన్నారు. సీఎల్పీ విషయంలో స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారని, అందులో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తామంటే వారు చేర్చుకోరా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *