ఐ యాం సారీ మోదీజీ.. నేను రాలేను: మమత బెనర్జీ

Mamata VS Modiji
కోల్కతా: రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని చెప్పిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి తాను రాలేనని.. ఇందుకు తనను క్షమించాలని కోరారు. తన ట్విటర్ ఖాతాలో ఈ లేఖను పోస్టు చేశారు.
‘మరో సారి ప్రధాని పదవి చేపడుతున్న నరేంద్రమోదీకి అభినందనలు. రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఆహ్వానం ప్రకారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని నేను అనుకున్నాను. కానీ బెంగాల్లో రాజకీయ ఘర్షణలు జరిగి 54 మంది హత్యకుగురయ్యారని భాజపా చెబుతున్నట్లు గంట నుంచి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం అని, బెంగాల్లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదు. వ్యక్తిగత కక్షలు, కుటుంబ తగాదాలు, ఇతర గొడవల వల్లే ఆ మరణాలు సంభవించాయని, వాటికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని అలా ఉన్నట్లు మా వద్ద ఎలాంటి రికార్డులు కూడా లేవు. మీడియాతో నేను ప్రమాణస్వీకారానికి రాలేకపోతున్నాను. ఐయామ్ సారీ నరేంద్రమోదీ జీ. ప్రమాణస్వీకారం అంటే ప్రజాస్వామ్య పండగ. రాజకీయ ప్రయోజనాల కోసం దాని విలువను తగ్గించొద్దు. దయచేసి నన్ను క్షమించండి’ అని దీదీ లేఖలో పేర్కొన్నారు.
బెంగాల్ లో రాజకీయ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన 54మందికి పైగా భాజపా కార్యకర్తల కుటుంబాలను మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మమతాబెనర్జీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.