Tue. Jun 18th, 2019

దక్కని మంత్రి పదవి… అలకతో ఎం ల్ ఏ రోజా…

1 min read
దక్కని మంత్రి పదవి... అలకతో ఎం ల్ ఏ రోజా...

దక్కని మంత్రి పదవి... అలకతో ఎం ల్ ఏ రోజా...

ఏపీ కేబినెట్ ప్రమాణ స్వీకారంలో.. కొత్త మంత్రులకు శాఖలు కేటాఇంచడంలో సీనియర్లు, జూనియర్లు, మహిళలు, యువతతో జగన్ టీమ్ సమతూకంతో ఉంది. అయితే మంత్రివర్గంలో స్థానం దక్కని నేతలు కొందరు అలిగినట్లు కనిపిస్తోంది.అందుకోసమే కొంతమంది ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టడం ఈ అనుమానాలకు దారితీస్తోంది. రోజాతో పాటు మరో ముగ్గురు నేతలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కానట్లు తెలుస్తోంది.

అయితే ఎమ్మెల్యే రోజా మంత్రివర్గ జాబితా విడుదల కాగానే శుక్రవారం సాయంత్రమే అమరావతి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్ వెళ్లారా.. నగరికి వెళ్లారా అన్నది ఇంకా క్లారిటీ లేదట. మంత్రి పదవి దక్కకపోవడంతో రోజా అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారా.. లేక మరేదైనా వ్యక్తిగత కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. రోజాతో పాటూ మరికొందరు నేతలు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి రానట్లు తెలుస్తుంది.

రోజాకి మంత్రి పదవి కాకపోయినా స్పీకర్ పదవైనా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆమెకు ఏ పదవి దక్కలేదు. రోజాకు మంత్రి పదవి ఖాయమని అనుచరులతో పాటు ఇటు కార్యకర్తలు కూడా భావించారు. శుక్రవారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశానికి వచ్చిన రోజా.. మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. తనది ఐరెన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్ అంటూ మరోసారి ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఇటు మహిళా కోటాలో హోంమంత్రి పదవి దక్కబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆమెకు పదవి దక్కకుండా పోవడం ఆమెతో పాటు అనుచరుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *