Thu. Jul 18th, 2019

తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం…

1 min read
England World Cup

England World Cup

లండన్: ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు 207 పరుగులకే ఆలౌట్ 104 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టులో ఏకంగా నలుగురు అర్ధ సెంచరీలు చేశారు. ఓపెనర్ జాసన్ రాయ్ 54, జో రూట్ 51, ఇయాన్ మోర్గాన్ 57 పరుగులు చేయగా, బెన్ స్టోక్స్ 89 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 18, మొయిన్ అలీ 3, క్రిస్ వోక్స్ 13, లియాం ప్లంకెట్ 9(నాటౌట్), జోఫ్రా అర్చర్ 7(నాటౌట్) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీసుకోగా, ఇమ్రాన్ తాహిర్, రబడ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పెహ్లుక్వాయో ఓ వికెట్ తీసుకున్నాడు.

అనంతరం 312 పరుగుల భారీ విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. సఫారీ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (68), డుసెన్ (50) పెహ్లుక్వాయో (24) మినహా మరెవరూ రాణించలేదు. ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. ఫలితంగా 104 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ 3 వికెట్లు పడగొట్టగా, లియాం ప్లంకెట్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అదిల్ రషీద్, మొయిన్ అలీ చెరో వికెట్ తీసుకున్నారు.

More Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *