Thu. Jul 18th, 2019

జగన్‌ను అడ్డుకున్న ఓ మహిళ ఆశ్చర్యానికి లోనైన ప్రజలు …

1 min read
YSR-Congress-Jagan

YSR-Congress-Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్‌ను ఓ మహిళా అడ్డుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం పద్మావతి అతిథి గృహానికి వెళ్లి… అక్కడి నుండి కడపకు తన కాన్వాయ్‌లో బయలుదేరారు. సడెన్‌గా ఓ మహిళ జగన్ కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లడంతో ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు. ఈ లోపే సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆమెను వెనక్కు పంపేందుకు ప్రయత్నించడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఇదంతా గమనించిన జగన్.. ఆమెను దగ్గరికి పిలిచి మాట్లాడాడు.

ఆ మహిళ తనది అమలాపురం అని, తన భర్తకు ఉద్యోగం కావాలని కన్నీరు పెట్టుకోవడం తో, జగన్‌కు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని , ఆందోళన చెందవద్దని ఆమెకు భరోసా ఇచ్చి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *