Tue. Jun 18th, 2019

జంపింగులు షురూ…బీజేపీ లోకి పలువురు చేరికలు…

1 min read
BJP

BJP

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఘోర పరాజయమైన సంగతి తెలిసిందే. వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ఫలితాలొచ్చి పట్టుమని పదిరోజులు కూడా సరిగ్గా అవ్వకముందే నేతలు మకాం మారుస్తున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల నుంచి భారీగా బీజేపీలో చేరికలు జరిగాయి. బీజేపీ నేత ఏపూరి రామయ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున నేతలు కండువాలు కప్పుకున్నారు. ముఖ్యంగా గురజాల, మాచర్ల నియోజకవర్గం నుంచి మండల, గ్రామ స్థాయి నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేతలందరికీ.. కండువాలు కప్పి పార్టీలోకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *