ఆ ఒక్క కారణంతోనే వైసీపీ గెలిచింది : చంద్రబాబు
1 min read
Chandra Babu Naidu
టీడీపీ ఓటమి పై … నేనున్నా తమ్ముళ్లూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు చంద్రబాబు. భవిష్యత్ పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ ఓటమి చెందలేదని.. జగన్‌పై ఉన్న సానుభూతి వైసీపీని గెలిపించిందని చెప్పారు. ఒక్క సీటుతో ప్రారంభించిన టీఆర్ఎస్..రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని.. ధైర్యం కోల్పోవద్దని నేతలతో చంద్రబాబు అన్నారు.
మరోవైపు….. జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడంపై టీడీపీఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది. వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నా… పార్టీ నేతలు వద్దని వారించారు. పార్టీ తరుపున ఓ బృందాన్ని పంపాలని సూచించారు. రాజ్‌భవన్‌లో అయితే వెళ్లొచ్చని, కానీ బహిరంగ ప్రమాణస్వీకారం కాబట్టి వద్దని నేతలు వారించారు. దీంతో. పయ్యావుల, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్‌రావుతో కూడిన ఓ బృందం…… రేపు చంద్రబాబు తరుపున శుభాకాంక్షలు తెలపనుంది.
cbn great leader