కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ కిషన్ మధ్యలో తడబడిన రెడ్డి..
1 min read
kishanreddy
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కేంద్ర సహాయమంత్రిగా తెలంగాణ ఎంపీ జి. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అయితే, ప్రమాణపత్రం చదవడంలో కిషన్ రెడ్డి కాస్త ఇబ్బంది పడ్డారు. హిందీలో ఉన్న ప్రమాణపత్రం చదువుతూ పలుమార్లు తడబడ్డారు. దాంతో రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఆ పదాలను కిషన్ రెడ్డితో తిరిగి పలికించారు.
ప్రమాణస్వీకారం పూర్తిచేసిన కిషన్ రెడ్డి అత్యంత విధేయతతో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఘనవిజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖాయం అంటూ కొన్నిరోజుల నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంవో నుంచి ఆయనకు ఫోన్ రావడంతో మంత్రిగా ఆయన పదవీప్రమాణం చేయనున్నట్టు ఖరారు అయింది.