కారుమబ్బులతో భాగ్యనగరం…
1 min read
Hyderabad Rain
హైదరాబాద్ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం సమయం వరకు తీవ్ర ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనానికి సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఉపశమనం కలిగించింది. నగరం అంతా కారు మబ్బులు కమ్ముకోవడంతో 5 గంటలకే చీకటిమయంగా మారింది. వాతావరణమంతా మబ్బులతో చల్లబడింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఇంకా కొన్ని గంటలపాటు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.