కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం పై కెసిఆర్ ఫైర్…
1 min read
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం పై కెసిఆర్ ఫైర్...
కాంగ్రెస్ తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని, తమ నాయకత్వంపై ఎమ్మెల్యేలకు నమ్మకం లేకుండాపోయిందని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేక.. తమను తప్పుబడితే ఎలా అని కేసీఆర్ ప్రశ్నించారు. నేడు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం’ పై ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ , కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.