Wed. Jan 27th, 2021

నవరత్నాల్లో రాలిపోయిన మూడు రత్నాలు…

1 min read
Vivamus magna justo, lacinia eget consectetur sed, convallis at tellus. Quisque velit nisi, pretium ut lacinia in, elementum id enim. Mauris blandit aliquet elit, eget tincidunt nibh pulvinar.
Ayyanna Patrudu about YSRCP

Ayyanna Patrudu about YSRCP

నర్సీపట్నం: ఏపీ లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలంతా కసితో పని చేసి టీడీపీ జెండాను మళ్లీ రెపరెపలాడించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి గెలుపు ఓటములు సహజమని, అందువల్ల ఎవ్వరు బాధపడవద్దన్నారు.

వై ఎస్ ఆర్ సి పి అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో మూడు రత్నాలు ప్రమాణ స్వీకారానికి ముందే రాలిపోయాయని అయ్యన్న అన్నారు. పింఛన్లు మూడు వేల రూపాయలు చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు తర్వాత ఎప్పుడో చేస్తానని అంటున్నారన్నారు. అలాగే పోలవరం తమ బాధ్యత కాదు, కేంద్రం చూసుకుంటుందని అంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటాం తప్ప.. ఏమీ చేయలేమంటూ వ్యాఖ్యానించారని ఎద్దేవా చేశారు.

Please follow, like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *