ఏపీ సీఎం జగన్ కు కన్నా లేఖ …
1 min read
ఏపీ సీఎం జగన్ కు కన్నా లేఖ...
ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సచివాలయాన్ని మార్చడంపై సీఎం జగన్ కు లేఖ రాశారు. సచివాలయాన్ని మార్చడం సరి కాదని హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఆర్థిక పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అప్పుల్లో చిక్కుకున్న రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయాలతో తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వెలిబుచ్చారు. జీఎన్ రావు కమిటీ నివేదికలోని అంశాలను ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారని కన్నా ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నదే తమ ఆలోచన అని లేఖలో పేర్కొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణకు బీజేపీ ఎప్పటికి వ్యతిరేకమని తెలిపారు. అన్ని వర్గాల నుంచి నిరసనలు వస్తున్నా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వినాశకర రీతిలో ముందుకెళుతోందని విమర్శించారు.