ఎయిర్ పోర్టులో చైనీయులు ప్రత్యక్షం… హడలిపోయిన ప్రజలు…

ఎయిర్ పోర్టులో చైనీయులు ప్రత్యక్షం... హడలిపోయిన ప్రజలు...
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని బెంబేలేత్తిస్తున్న వైరస్, చైనా లో పుట్టిన మహమ్మారి, చైనా పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఏకంగా చైనీయులు కనిపిస్తే ఇంకెంత హడలిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఏపీలోని రేణిగుంట విమానాశ్రయంలో ఒక్కసారిగా 15 మంది చైనా జాతీయులు ప్రత్యక్షమయ్యేసరికి అక్కడ ఉన్నవారందరూ భయాందోళనలకు లోనయ్యారు. వారంతా ముఖాలకు మాస్కులు ధరించి కనిపిచండంతో ఎయిర్ పోర్టు వర్గాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఆ చైనీయులను ప్రశ్నించగా, తాము వస్తోంది చైనా నుంచి కాదని బెంగళూరు నుంచి అని చెప్పడంతో వాతావరణం తేలికపడింది.